Mohammad Rizwan : మళ్లీ నిరాశే.. వైస్ కెప్టెన్గా మహమ్మద్ రిజ్వాన్

Byline :  Bharath
Update: 2024-01-08 13:56 GMT

బాబర్ ఆజం తర్వాత సీనియర్, సమర్థుడైన మహమ్మద్ రిజ్వాన్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మరోసారి మొండి చేయి చూపించింది. కెప్టెన్సీపై గంపెడు ఆశలు పెట్టుకున్న రిజ్వాన్ కు మరోసారి నిరాశే మిగిలింది. వన్డ్ వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. బాబర్ తర్వాత సమర్థుడైన రిజ్వాన్ కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారంతా. ఈ క్రమంలో రిజ్వాన్ కు ఊహించని షాక్ తగిలింది. టెస్ట్ కెప్టెన్ గా షాన్ మసూద్ ను, టీ20 పేసర్ గా షాహీన్ అఫ్రిదీని నియమించింది. ఈ క్రమంలో రిజ్వాన్ కు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుండని పాక్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన పాక్ క్రికెట్ బోర్డ్.. న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం.. పాక్ జ‌ట్టును మ‌రింత ప‌టిష్టం చేసే బాధ్య‌తను రిజ్వాన్, అఫ్రిదీకి అప్ప‌గించినట్లు బోర్డ్ సభ్యులు చెప్పుకొచ్చారు. కాగా టీ20 85 మ్యాచ్ లు ఆడిన రిజ్వాన్.. 2792 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అఫ్రిదీ 52 మ్యాచ్ లు ఆడి.. 64 వికెట్లు తీసుకున్నాడు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా.. 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

పాకిస్థాన్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్-కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్

పూర్తి షెడ్యూల్

1వ టీ20- జనవరి 12న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో

2వ టీ20- జనవరి 14న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో

3వ టీ20- జనవరి 17న యూనివర్సిటీ ఓవల్, డునెడిన్‌లో

4వ టీ20- జనవరి 19న హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్‌లో

5వ టీ20- జనవరి 21న హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్‌లో





Tags:    

Similar News