Mohammed Shami : పెళ్లి గెటప్లో షమీ.. నెట్టింట ఫొటోలు వైరల్..

Byline :  Krishna
Update: 2024-01-20 10:54 GMT

వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ మొదటి పెళ్లి పెటాకులు అయ్యింది. 2014లో మోడల్ హసీనా జహాన్ను షమీ పెళ్లాడాడు. అయితే షమీ సహా అతని కుటుంబం తనను హింసిస్తోందని హసీనా కోర్టుకెక్కింది. అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో షమీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశాడు. అతడు పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది.

షమీ ట్వీట్పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి చేసుకుంటున్నారా అని కొందరు అడుగుతుంటే.. కొత్త గెటప్ ఏంటీ సర్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో షమీ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కాగా షమీ గాయం కారణంగా టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ఆయన్ని పక్కనబెట్టింది. తర్వాతి మూడు టెస్టులకు ఆయన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. షమీ ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. మొన్నటి వరల్డ్ కప్లో షమీ అద్భుత ప్రదర్శన చేశారు. తన బౌలింగ్తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు.

Tags:    

Similar News