Mohammed Shami : రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న షమీ

Byline :  Krishna
Update: 2024-01-09 07:19 GMT

టీమిండియా వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ అర్జున అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతడికి అవార్డును అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. క్రీడాకారులకు ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో షమీ అద్భుత ప్రదర్శన చేశారు. తన బౌలింగ్తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు 101 వన్డేల్లో 195 వికెట్లు పడగొట్టగా.. 64 టెస్టుల్లో 229 వికెట్లు, 23 టీ20ల్లో 24 వికెట్లు తీశాడు.

అంతుకుముందు ఈ అవార్డుపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ప్రతీ క్రీడాకారుడి కల అని చెప్పారు. తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘ ఈ అవార్డు దక్కడం పట్ల ఎంతో గర్వపడుతున్నాను. చాలా మంది క్రీడాకారులు ఈ అవార్డు కోసం ఎదురుచూస్తారు. కానీ కొంతమందికే ఇది దక్కుతుంది. చాలా మందికి జీవితకాలం గడిచిపోయినా ఈ అవార్డు నెరవేరని కలగా మిగిలిపోతుంది’’ అని షమీ అన్నాడు.

కాగా గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్కు సైతం అతడు దూరమయ్యే అవకాశలున్నాయి. 5 టెస్టుల సరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు షమీ దూరమయ్యే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించని షమీ.. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. అయితే గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపిన షమీ.. త్వరగా జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News