తప్పించుకుని పారిపోయిన ధోనీ.. వీడియో వైరల్

Byline :  Bharath
Update: 2024-02-06 14:54 GMT

ఇండియాలో క్రికెట్ ను మతంగా.. క్రికెటర్లను డెమీ గాడ్స్‌లా భావిస్తారు చాలామంది. దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకీ.. కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో వీడ్కోలు పలికి ఐదేళ్లైనా.. ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీకి సంబంధించిన ఏ చిన్న వార్తైనా.. ఇప్పటికీ హెడ్ లైన్స్ లో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. ఐపీఎల్ ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉన్నాడు. కేవలం ధోనీ ఆట చూసేందుకే చాలామంది స్టేడియానికి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ధోనీ.. వారివల్ల చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు.

తాజాగా మరోసారి ఫ్యాన్స్ అతి అభిమానానికి బలైపోయాడు. వందల సంఖ్యలో చుట్టుముట్టిన అభిమానుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఏ దేశంలో తీసిందే తెలియదు కానీ.. ధోనీ బాగా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ధోనీ వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బయట కనిపించిన ధోనీని వందల మంది చుట్టుముట్టారు. సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడం బౌన్సర్ల వల్ల కూడా కాలేదు. దీంతో ధోనీ అక్కడి నుంచి పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్లినా వదలళ్లేదు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నెటిజన్స్.. వారి ప్రైవసీకి భంగం కలిగించడం కరెక్ట్ కాదని అంటున్నారు. అభిమానం ఉండాలి కానీ, మరీ ఇంతలా ఇబ్బంది పెట్టేలా ఉండొద్దని సూచిస్తున్నారు.

Tags:    

Similar News