MS Dhoni : కొత్త జంట కొంప ముంచిన ధోనీ.. దీవించడానికి వెళ్లి.. వీడియో వైరల్
ఎంఎస్ ధోనీ మైదానంలో ఉన్నట్లు కాదు. బయట చాలా సైలెంట్. చాలా తక్కువగా ఫంక్షన్స్ కు అటెండ్ అవుతుంటాడు. ఇతరులతో కలిసినా.. చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అయితే మాట్లాడిన కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా లోతుగా, భావోద్వేగంగా మాట్లాడుతాడు. ఆ టైంలో ధోనీ మాట్లాడిన మాటలు.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికైనా ప్రేరణనిస్తాయి. అయితే ఈసారి మాత్రం ధోనీ మాట్లాడిన మాటలు కొత్త జంట.. కొంప ముంచినంత పనిచేశాడు. కొత్త జంటను ఆశీర్వదించడానికి స్టేజిపైకి వెళ్లిన ధోనీ మైక్ అందుకుని.. భార్య స్థానాన్ని కొనియాడుతూనే వ్యంగ్యంగా పంచులు విసిరాడు. తాజాగా రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం వేడుకకు ధోనీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ధోనీ..
‘పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. చాలాబాగా డ్యాన్స్ కూడా చేశారు. అయితే రాబోయే సవాలు సమయంలో వారికి ఇవే నా శుభాకాంక్షలు. సవాలు అంటే కెరీర్ గురించి మాట్లాడుతున్నా (నవ్వుతూ)’ అని ధోనీ చమత్కరించాడు. కాగా, రిషబ్ పంత్ సోదరి సాక్షి నిశ్చితార్థం అంకిత్ చౌదరీతో ఘనంగా జరిగింది. గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు.. ఇప్పుడు పెళ్లి పోటలెక్కబోతున్నారు. తాజాగా ధోనీ హుక్కా పీల్చుతూ వైరల్ అయిన వీడియో ఈ ఫంక్షన్ లోనిదే.