ముంబై ఇండియన్స్లో కీలక మార్పు.. జట్టు నుంచి ఇషాన్ కిషన్ అవుట్

By :  Bharath
Update: 2023-11-28 06:07 GMT

ఐపీఎల్ 2024 హడావిడి మొదలైంది. మొన్నటితో ఆటగాళ్ల రిటెన్షన్ ముగిసింది. ఫ్రాంచేజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా.. మరికొంతమందిని రిటైన్, ట్రేడ్ చేసుకుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసింది. కమెరూన్ గ్రీన్ సహా మరికొంతమంది ఆటగాళ్లను వదులుకుంది. దీంతో గ్రీన్ ను ఆర్సీబీ ట్రేడ్ చేసుకుంది. కాగా ముంబై జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, సందీప్ వారియర్ విడుదల చేసింది. వీళ్లతో పాటు ఇషాన్ కిషన్ ను కూడా ముంబై వదులుకునే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం ముంబై పర్స్ లో మిగిలిపోయిన డబ్బు రూ. 15 కోట్లు మాత్రమే. పర్స్ వ్యాల్యూ పెంచుకుని వేలంలో మరికొంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ముంబై ఇషాన్ కిషన్ తో సహా మరికొంతమంది ప్లేయర్లను వదుకుంటుంది. కాగా పర్స్ లో డబ్బు పెంచుకునేందుకు ముంబై కీలక ఫామ్ లో ఉన్న ప్లేయర్లను వదులుకుంటుందని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. కాగా డిసెంబర్ 19 దుబాయ్ వేదికగా జరిగే వేలంలో అన్ని జట్లు పాల్గొంటాయి. అయితే హార్దిక్ పాండ్యా చేరికతో ముంబై ఇండియన్స్ జట్టు గతంకన్నా బలంగా కనిపిస్తుంది. పోయిన ఐపీఎల్ ఎడిషన్ లో వరుస ఓటములతో ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News