ICC Worldcup 2023: భీకర ఫామ్లో విరాట్ కోహ్లీ.. నవీన్ ఉల్ హక్కు మూడింది

Byline :  Bharath
Update: 2023-09-13 14:53 GMT

ఐపీఎల్ నుంచి పీకలవరకు కోపంలో ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య పోరుకు టైం వచ్చింది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టులో నవీన్ ఉల్ హక్ కు చోటు కల్పించింది. ఆసియా కప్ లోనే ఈ ఇద్దరి మధ్య పోరును చూస్తామని అనుకున్నారంతా. కానీ ఆసియా కప్ కు నవీన్ ను దూరం పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. దాంతో నిరాశ చెందిన కోహ్లీ ఫ్యాన్స్ తాజా జట్టు ప్రకటనతో ఖుషీలో ఉన్నారు. కోహ్లీ vs నవీన్ మధ్య ఆట చూడాలని, నవీన్ బౌలింగ్ లో బాదుతుంటే ఆనందించాలని ఆశగా ఉన్నారు.




 


ఐపీఎల్ 2023లో నవీన్, కోహ్లీ మధ్య జరిగిన ఫైట్ తెలిసిందే. లక్నోకు ఆడిన నవీన్.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీపై సీరియస్ అయ్యాడు. ఇద్దరి మధ్య వైరాన్ని లక్నీ టీం సర్ధుమనిగించాలని చూసినా నవీన్ వినలేదు కదా. సోషల్ మీడియా వేదికగా కోహ్లీని, బెంగళూరును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి విరాట్ ఫ్యాన్స్ నవీన్ పై పగ పెంచుకున్నారు. దొరికిన చోటల్లా ట్రోల్ చేశారు. ఇద్దరి మధ్య గ్రౌండ్ లో ఫైట్ మరోసారి చూడాలని, నవీన్ పై కోహ్లీ రివేంజ్ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 11న జరిగే భారత్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు.




 






Tags:    

Similar News