Asian Games 2023: ఇద్దరు భారతీయుల మధ్య పోటీ.. నీరజ్కు స్వర్ణం

Byline :  Bharath
Update: 2023-10-04 13:14 GMT

ఏషియన్ గేమ్స్ లో భారత అథ్లెట్లు దమ్ము రేపుతున్నారు. పతకాలను సాధిస్తూ దూసుకుపోతున్నారు. జావలిన్ త్రోలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. మరోసారి సత్తా చాటాడు. ఏషియన్ గేమ్స్ ఫైనల్ లో చెలరేగి స్వర్ణం గెలుచుకున్నాడు. మరో భారత ఫైనలిస్ట్ కిశోర్ జెనాకు రజత పతకం లభించింది. స్వర్ణ పతకం కోసం జరిగిన ఫైనల్ రౌండ్ లో.. నీరజ్, కిశోర్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఒకరిని మించి మరొకరు పోరాడారు.




 


చివరికి నీరజ్ 88.88 మీటర్లు విసిరి స్వర్ణం గెలుపొందాడు. మరోవైపు పురుషుల 5 వేల మీటర్ల ఫైనల్ లో అవినాశ్ ముకుంద్ సాబలే రజతం గెలుచుకున్నాడు. అతడు 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగా అవినాశ్ కు ఇది రెండో పతకం. 3 వేల మీటర్ల పరుగులో అతను గోల్డ్ గెలుచుకున్నాడు. ఇక మహిళల 800 మీటర్స్ ఫైనల్స్ లో హర్మిలన్ సిల్వర్ గెలుచుకుంది. 1500 మీటర్ల ఈవెంట్ లో కూడా ఆమె సిల్వర్ గెలుచుకుంది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో సునీల్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు.




 



Tags:    

Similar News