IND vs NEP: పది ఓవర్లైనా నేపాల్దే పై చేయి
పల్లెకెలె వేదికపై జరుగుతున్న మ్యాచ్ లో నేపాల్, టీమిండియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తో ఒక్క మ్యాచ్ కూడా ఆడని నేపాల్.. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటోంది. ఎటువంటి బెరుకు లేకుండా బౌలర్లకు సవాల్ విసురుతూ, దూకుడుగా ఆడుతోంది. దాంతో పది ఓవర్లకు 6 సగటుతో.. 65 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ భుటెల్ (38, 25 బంతుల్లో) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ (24, 41 బంతుల్లో) నిలకడగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. 10 ఓవర్లో షార్దూల్ ఠాకూర్ కుశాల్ ను పెవిలియన్ చేర్చగా.. భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆరంభం నుంచి మొత్తం నాలుగు సింపుల్ క్యాచ్ లను వదిలిపెట్టారు టీమిండియా ఫీల్డర్లు. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ మిస్ చేసి నేపాల్ బ్యాటర్లకు లైఫ్ ఇచ్చారు.
తుది జట్లు:
నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(w), రోహిత్ పౌడెల్(c), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ KC, లలిత్ రాజ్‌బన్షి
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్