మరో 20 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించి.. ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. కాగా ప్రపంచకప్ సన్నాహాలు మొదలు పెట్టిన నెదర్లాండ్స్.. వినూత్న రీతిలో ఓ ప్రకటన చేస్తుంది. నెట్స్ బౌలింగ్ చేయడం కోసం భారత్ బౌలర్లు కావాలని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఆ వినూత్న ప్రకటన వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ కోసం నెదర్లాండ్స్ బౌలర్లు బెంగళూరులోని ఏలూర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఆసక్తి ఉన్న నెట్ బౌలర్లు అప్లై చేసుకోవాలని, దానికి కనీసం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన వీడియోను జత చేసి పంపాలని కోరింది.
ప్రతీసారి విదేశీ పర్యటనకు వచ్చిన జట్టు, ఆ దేశ కుర్రాళ్లను నెట్ బౌలర్లుగా ఎంపిక చేస్తుంది. అయితే నెదర్లాండ్స్ బోర్డ్ మాత్రం తమకు లెఫ్ట్ ఆర్మ్, రైటార్మ్ పేసర్లు.. ఓ మిస్టరీ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కావాలంటూ ఆ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే క్యాంపులో నెట్ బౌలర్ల కొరత ఏర్పడింది. అయితే భారత్ నుంచి వచ్చే నెట్ బౌలర్లను అన్ని రకాల వసతులు కల్పిస్తామని, తమ ప్లేయర్లను చూసుకున్నట్లు చూసుకుంటామని తెలిపారు. నెదర్లాండ్స్ లో దేశవాళి ప్లేయర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డ్ దగ్గర డబ్బూ తక్కువే. దాంతో వాళ్ల విదేశీ టూర్ పెట్టే ఖర్చులో సగం భారత బౌలర్లపై పెడితే బాగుంటుందని వాళ్ల ఆలోచన.