వరల్డ్ కప్లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో టీమిండియా ముందు కివీస్ 274 పరుగుల టార్గెట్ పెట్టింది. 50వ ఓవర్ లో న్యూజిలాండ్ టీం ఆలౌటైంది. డెరిల్ మిచెల్ 126 రన్స్ చేసి జట్టు మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. డెరిల్ మిచెల్ 130, రచిన్ రవీంద్ర 75 పరుగులు చేశారు. వీరు మినహా మిగతా బ్యాటర్లు క్రీజ్లో ఎక్కువ సేపు నిలవలేకపోయారు.
డారిల్ మిచెల్ 130 (127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) రన్స్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. రచిన్ రవీంద్ర 75 (87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) భారీ ఇన్సింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (23), విల్ యంగ్ (17) పరుగులు చేయగా.. డేవాన్ కాన్వే (0), టామ్ లేథమ్ (5), మార్క్ చాప్‌మన్ (6), మిచెల్ శాంట్నర్ (1), హెన్రీ (0), ఫెర్గూసన్ (1) ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు.ట్రెంట్ బౌల్డ్ (0*) నాటౌట్‌గా నిలిచాడు.
టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ అదరగొట్టాడు. అత్యధికంగా 5 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ల రూపంలో కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెరిల్ మిచెల్ ఆచితూచి ఆడి టీంకు బాసటగా నిలిచారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 150 పరుగులు జత చేశారు. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టు స్కోర్ పెంచారు. పిచ్ స్పిన్నర్లకు బౌన్స్ అవుతుండటంతో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. వరల్ కప్ టోర్నీ చరిత్రలో 32 వికెట్లు తీయడం ద్వారా మహ్మద్ షమీ ఇంతకుముందు ఉన్న అనిల్ కుంబ్లే (32) రికార్డును అధిగమించాడు.