ICC World Cup 2023: న్యూజిలాండ్ జైత్రయాత్ర.. మరో భారీ విజయం

By :  Bharath
Update: 2023-10-09 16:43 GMT

వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జైత్రయాత్రను మొదలుపెట్టింది. మరో భారీ విజయాన్ని నమోదు చేసి.. పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ కు దూసుకుపోయింది. హైదరాబాద్ వేదికపై నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించి.. డచ్ ఆటగాళ్లను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లు మొదట కాస్త భయపెట్టినా.. తర్వాత చేతులెత్తేశారు. కివీస్ జట్టులో దాదాపు ప్రతీ బ్యాటర్ రాణించారు. విల్ యంగ్ (70), రచిన్ రవిచంద్ర (51), టామ్ లాథమ్ (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఓపెనర్ డేవాన్ కాన్వే (32), డారిల్ మిచెల్ (48), చివర్లో మిచెల్ శాంట్నర్ (36) రాణించారు. దీంతో కివీస్ ఈజీగా 300 పరుగులు దాటింది. బౌలింగ్ లో నెదర్లాండ్స్ బౌలర్లు.. ఆర్యన్ దత్ , వాన్ మీకెరన్, వాన్ డెర్ మెర్వ్.. చెరో రెండు వికెట్ తీసి సత్తాచారు. బాస్ ది లీడ్ కి ఒక వికెట్ దక్కింది.

323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (12), మ్యాక్స్ ఓడోడ్ (16) ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన కోలిన్ ఆకెర్ మెన్ 69 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ 30, సిబ్రాండ్ 29, తేజ 21.. ఎక్కువసేపు క్రీజులో నిల్వలేకపోయారు. కివీస్ బౌలర్లలో సాంటర్న్ 5 వికెట్లతో సత్తాచాటాడు. తన స్పిన్ మాయాజాలంతో నెదర్లాండ్స్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు మ్యాట్ హెన్రీ 3 వికెట్లు తీసుకున్నాడు. రచిన్ రవిచంద్రకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Tags:    

Similar News