న్యూజిలాండ్ హ్యాట్రిక్ విక్టరీ.. బంగ్లాదేశ్పై 8వికెట్ల తేడాతో గెలుపు
వరల్డ్ కప్లో న్యూజిలాండ్ టీం ఆధిపత్యం కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో టాప్ ప్లేస్లో దూసుకెళ్తోంది. ఇవాళ చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది. 246 టార్గెట్ ను 42.5 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ 89రన్స్, కేన్ విలియమ్సన్ 78 రన్స్ తో బంగ్లా బౌలర్లకు చుక్కులు చూపించారు. బంగ్లా బౌలర్లలో ముష్ఫికర్ రహ్మాన్, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 56 రన్స్ కే ల వికెట్లు కోల్పోయింది. అయితే రహీమ్, షకీబుల్ హసన్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి స్కోర్ ను 152కు తీసుకెళ్లారు. ఆ తర్వాత షకీబ్ ఔటవ్వగా.. రహీమ్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. చివర్లో మహ్మదుల్లా 41తో రాణించడంతో బంగ్లా 245 రన్స్ చేసింది.
కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మత్ హెన్రీ చెరో 2 వికెట్లు, మిచెల్ శాట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.