ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి పోరుతో ఈ మహాసంగ్రామం మొదలైంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరముండగా.. గాయంతో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఆడడం లేదు. డిఫెండింగ్ ఛాంపియిన్ ఇంగ్లాండ్ కు షాకివ్వాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్ లో బోణీ కొట్టి సీజన్ ను గ్రాండ్ గా ప్రారంభించాలని ఇంగ్లాండ్ చూస్తోంది. ఇక ఈ తొలిపోరులో విజయం ఎవరినీ వరిస్తుందో వేచి చూడాలి.
ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్