వెస్టిండీస్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. కారణం ఏంటంటే..?

Update: 2023-07-03 01:39 GMT

వెస్టిండీస్ క్రికెట్ లో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. బోర్డ్ లో సరైన నాయకత్వం లేకపోవడం.. ఆటగాళ్లు, బోర్డ్ కు మధ్య గొడవలు, జీతాలు ఇవ్వకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది ప్లేయర్స్ వెస్టిండీస్ టీంపై అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా విండీస్ కు మెయిన్ స్పాన్సర్షిప్ కూడా లేకపోవడం జట్టు పతనానికి కారణం అయింది. రెండుసార్లు విశ్వ విజేత అయిన బోర్డుకు ఆటగాళ్ల మద్దతు లేకపోవడంతో ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం, మరికొందరు ప్లేయర్స్ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజ్ టోర్నీలు ఆడుతున్నారు. దీంతో వెస్టిండీస్ జట్టు పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మొదటిసారి వెస్టిండీస్ వరల్డ్ కప్ కు అర్హత సాధించకుండా.. టోర్నీ నుంచి వెనుదిరిగింది.

ఇన్ని పరిస్థులు నడుమ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా త్వరలోనే విండీస్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ డబ్బుల కోసం జాతీయ జట్టును వదిలి ఫ్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో ఆడబోతున్నాడు. ఇప్పటికే హెట్మయర్, నరైన్, రసెల్ లాంటి ప్లేయర్లు.. జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంఛైజీ టోర్నీలు ఆడుతున్నారు. త్వరలో పూరన్ కూడా వీళ్ల దారిలో వెళ్లే ఛాన్సుంది. ప్రస్తుతం విండీస్ బోర్డు పూరన్ కు ఏడాదికి దాదాపు రూ.2కోట్లు చెల్లిస్తుండగా, ఒక్క ఐపీఎల్ లోనే అతను రూ.16కోట్లు అందుకుంటున్నాడు.

Tags:    

Similar News