Dhoni : మాటలు కాదు..చేతల్లో ఉండాలి.. ధోని

Update: 2024-02-10 02:52 GMT

(Dhoni)మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఈ పేరంటూ తెలిని వారు ఉండరేమో! మ్యాచ్ లో ప్రత్యర్థులను అర్థం చేసుకొని అప్పటికప్పుడు వ్యూహాలు రచించడంలో ఆయనకు ఆయనే సాటి. మ్యాచ్ ఎంత హై ఓల్టెజ్ లో జరుగుతన్న ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపించే మిస్టర్ కూల్ కెప్టెన్. టీమిండియా రథసారథిగా ఇండియాకు ఎన్నో ట్రోఫీలను తెచ్చిన ఘనత ఆయనది. ఇండియా క్రికెట్ కు రిటెర్మెంట్ ప్రకటించిన ధోని..ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇతరుల పట్ల ఎలా ఉండాలి అన్న దానిపై పలు సూచనలు ఇచ్చాడు.




 


కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని.. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని ఆయన అభిప్రాయ పడ్డారు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని సూచించారు. మన పట్ల వ్యక్తుల్లో విధేయత.. గౌరవం ద్వారానే వస్తుందని చెప్పారు. డ్రెస్సింగ్‌ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే లాయాల్టీగా ఉండరని స్పష్టం చేశారు. అంతేగాక మనం కేవలం మాటలు చెబితే సరిపోదనీ...ఏదైనా సరే చేతల్లోనే చూపించాలని చెప్పుకొచ్చారు. మన ప్రవర్తనే మనకు గౌరవం తెచ్చిపెడుతుందని తెలిపారు. అంతేగానీ..మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని తను నమ్మనని చెప్పారు. మనం ఎలా వ్యవహరిస్తామన్నదాన్ని బట్టే గౌరవం దక్కుతుందన్నారు. మొత్తంగా గౌరవం దానంతట అది రాదని...మనమే దాన్ని సంపాదించుకోవాలని సూచించారు. మనల్ని సహచరులు నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుందని మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు. 




Tags:    

Similar News