వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో చేసిన ఆధిక్యాన్ని కూడా చేదించలేక.. చేతులెత్తేసింది. విరాట్ కోహ్లీ (76) ఒక్కడై నిలబడ్డా.. మిగతా ఏ భారత బ్యాటర్ క్రీజులో నిలబడలేకపోయాడు. కోహ్లీ, శుభ్ మన్ గిల్ (26) తప్ప.. ఏ భారత బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మొదట ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ కావడం, జైశ్వాల్ 5 పరుగులకే వికెట్ పారేసుకోవడంతో.. భారత పతనం ప్రారంభం అయింది. తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలబడలేకపోయారు.
శ్రేయస్ అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ డకౌట్, శార్దూల్ (2), బుమ్రా (1), సిరాస్ (5) దారుణంగా విఫలం అయ్యారు. దాంతో సౌతాఫ్రికా ఒక ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరో రెండు రోజుల మిగిలుండగానే ఆట ముగిసిపోయింది. బర్గర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. రబాడా 2, జాన్సన్ 3 వికెట్లు తీసుకున్నారు.