క్రికెట్‌ ప్రపంచానికి కొత్త షాట్ పరిచయం చేసిన బాబర్ అజామ్..!

Update: 2023-07-27 12:43 GMT

పొట్టి ఫార్మాట్ క్రికెట్‌ రాకతో కొత్త షాట్‌లు వెలుగులోకి వచ్చాయి. రకరకాల షాట్లతో బ్యాటర్లు బంతిని బౌండరీ దాటిస్తున్నారు. వినూత్న షాట్స్ తో ఫీల్డర్ లేని చోట నుంచి బంతిని పంపించేస్తున్నారు. రూఫర్, బూఫ్ స్కూప్ , లేహ్-స్కూప్, బ్యాక్ స్ట్రోక్, బ్యాక్ పాడిల్, ర్యాంప్ ఇలా కొత్త షాట్స్‌ ప్లేయర్స్ బ్యాట్స్ నుంచి వస్తున్నాయి. తాజాగా క్రికెట్ ప్రపంచానికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సరికొత్తను షాట్‌ను పరిచయం చేశాడు.

కొలంబో వేదికగా శ్రీలకం-పాకిస్థాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్‌ ఇన్నింగ్‌ సమయంలో శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో విసిరిన ఓ బంతిని.. బాబర్‌ కొత్తగా ఆడి స్లిప్‌ దిశగా బౌండరీ పంపాడు. ఫుల్‌ ఆఫ్ సౌడ్ బంతి రాగా దానిని వదిలేసే విధంగా బాబర్ బ్యాట్ పైకెత్తాడు. కాని చివరి నిమిషంలో దానిని స్లిప్ దిశాగా బౌండరీకి తరలించాడు. ముట్టి ముట్టనట్లు, కొట్టి కొట్టనట్లు బాబర్ ఆజామ్ ఆడిన ఈ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాబర్‌ ఆడిన షాట్‌పై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.అనుకోకుండా బ్యాట్‌కు తగిలదని కొంతమంది అంటుంటే ..మరికొందరు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆ షాట్ ఆడినట్లు చెబుతున్నారు. ఈ షాట్‌ను నెట్స్‌లో బాబర్ ఆజామ్ ప్రాక్టీస్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక మ్యాచ్ విసయానికొస్తే.. పాక్ 222 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. శ్రీలకం మొదటి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలగా...పాక్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 576/5 స్కోర్‌కు డిక్లేర్డ్ చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ అబ్దుల్లా షఫీఖ్‌ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్‌ (132 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 188 పరుగులకే చేతులెత్తేయడంతో పాక్‌కు 222 పరుగులు ఇన్నింగ్స్ విజయం వరించింది. ఈ మ్యాచ్‎లో బాబర్ అజామ్ కేవలం 39 పరుగులకే ఔటయ్యాడు.


Tags:    

Similar News