World Cup 2023 Pakistan vs South Africa : పాక్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..

Byline :  Veerendra Prasad
Update: 2023-10-27 04:18 GMT

ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు పాకిస్థాన్‌ సిద్ధమైంది. చెన్నై చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డూ ఆర్‌ డై మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి సర్వత్రా విమర్శలు కురుస్తున్న వేళ.. మహా సంగ్రామంలో ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాక్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్‌ సెమీఫైనల్‌ అవకాశాలు పూర్తిగా గల్లంతవుతాయి. ఇప్పటికే పాక్‌ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే దాయాది జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది.




 


అయితే.. కీలక పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ హసన్ అలీ ఈ మ్యాచుకు దూరమయ్యాడు. ఈ స్టార్ పేసర్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాడు. ఫామ్ లో ఉన్న హసన్ అలీ.. సౌతాఫ్రికా మ్యాచుకు అందుబాటులో ఉండటం లేదు. హసన్ అలీ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్ కు చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. హసన్ అలీ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదు. అయితే.. ప్రస్తుతం అతను జ్వరం నుంచి కోలుకుంటున్నాడని పాక్ మేనేజ్మెంట్ తెలిపింది. అయితే.. భవిష్యత్తు మ్యాచులు దృష్ట్యా.. హసన్ అలీకి ఈ మ్యాచులో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది.




హసన్ అలీ.. ఫస్ట్ ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవ్వలేదు. అయితే.. మరో స్టార్ పేసర్ నసీం షా గాయపడటంతో అతని స్థానంలో హసన్ అలీ చోటు దక్కించుకున్నాడు. ఇక.. పాకిస్థాన్ జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం.బలమైన జట్టుగా ఉన్న దక్షిణాఫ్రికాపై గెలవాలంటే ప్రతి విషయంలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. పాక్ జట్టు తన ఆట తీరు మార్చుకుంటే సెమీఫైనల్ రేసులో ఉండదు. బ్యాటింగ్‌లో ఇమామ్ హుల్ హక్, బాబర్ ఆజం, రిజ్వాన్, ఇఫ్తార్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు కలిసి ఆడడం లేదు. ఇద్దరిలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరికీ పట్టదు. బౌలింగ్‌లో కూడా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ వంటి అత్యుత్తమ బౌలర్లు స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. స్పిన్ విభాగం చాలా బలహీనంగా ఉంది.




Tags:    

Similar News