World cup 2023: కెప్టెన్సీకి బాబర్ గుడ్ బై

Byline :  Bharath
Update: 2023-11-12 01:56 GMT

ప్రపంచకప్ లో దారుణంగా ఫెయిల్ అయిన పాకిస్తాన్ జట్టు లీగ్ స్టేజ్ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయి.. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో లో 5వ స్థానంలో నిలిచింది. దీంతో పాక్ అభిమానులతో పాటు.. మీడియా, మాజీ ప్లేయర్లు కూడా జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైఫల్యానికి కారణం కెప్టెన్ బాబర్ ఆజం అని, బ్యాటింగ్ లో జట్టును ముందుకు నడిపించడంలోనూ, వ్యూహాలు అమలు చేయడంలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మండిపడుతున్నారు. అంతేకాకుండా బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ బాబర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో టోర్నీ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ బాబర్ బదులిచ్చాడు. ఆ సమాధానంతో బాబర్ వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెప్తాడనే ప్రచారం జోరందుకుంది.

వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ వెళ్లి పీసీబీ ఛైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. కాగా జట్టుపై వస్తున్న విమర్శలను బాబర్ తిప్పికొట్టాడు. టీవీల్లో మాటలు చెప్పడం చాలా సులువని పాక్ మాజీలకు చురకలు అంటించాడు. సలహాలు ఇవ్వాలనుకుంటే నేరుగా తనతో చెప్పాలని, తన ఫోన్ నెంబర్ అందరికీ తెలుసని సూచించాడు. కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్ పై చూపలేదని చెప్పుకొచ్చాడు. ఆప్ఘనిస్తాన్ తో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం, చేజేతులా వచ్చిన సౌతాఫ్రికా మ్యాచ్ లో ఓడిపోవడంతో పాక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. 

Tags:    

Similar News