Babar Azam: స్పీడ్ పెంచిన పాకిస్తాన్.. టీం కొత్త కెప్టెన్లు వీరే

By :  Bharath
Update: 2023-11-16 04:42 GMT

భారత్ లో జరిగిన వరల్డ్ కప్ కోసం భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. దారుణంగా ఫెయిలై.. లీగ్ స్టేజ్ నుంచే వైదొలిగింది. ఈ ప్రదర్శనకు బాధ్యత వహించిన పాక్ బాబర్ ఆజం తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టీ20 ఫార్మాట్ కు కెప్టెన్ గా బౌలర్ షాహీన్ అఫ్రిది, టెస్టులకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ షాన్ మసూద్లను కెప్టెన్లుగా నియమించింది. కాగా వన్డేలకు ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయాన్ని మాత్రం పాక్ బోర్డు వెల్లడించలేదు. గతంలో మూడు ఫార్మాట్లకు బాబర్ ఒక్కడే కెప్టెన్ ఉండగా, ఇప్పుడు పీసీబీ స్ప్లిట్ కెప్టెన్సీ పద్ధతిని అనుసరిస్తుంది. అనగా ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ను నియమించింది.

ఈ వరల్డ్ కప్లో పాక్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. 9 మ్యాచ్లలో నాలుగింట మాత్రమే గెలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిన్న జట్టైన ఆఫ్గాన్ చేతిలోనూ ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంది. కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. అతడు 9మ్యాచులలో 320 రన్స్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 స్థానానికి కూడా చేజార్చుకున్నాడు. 2020లో అతడు పాక్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 

Tags:    

Similar News