World Cup 2023 : ఎట్టకేలకు పాకిస్తాన్ టీంకు వీసాలు.. ఆ రోజు ఇండియాకు..

Byline :  Krishna
Update: 2023-09-25 16:49 GMT

ఎట్టకేలకు పాకిస్తాన్కు భారత వీసాలు మంజూరు అయ్యాయి. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఆ జట్టు ఇండియాకు చేరుకోనుంది. వీసా కోసం పది రోజుల క్రితం పాక్ జట్టు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వీసాలు కాస్త లేట్ మంజూరు అయ్యాయి. ఇప్పటికే వీసాలపై పాక్ ఐసీసీకి లేఖ రాసింది.

వరల్డ్ కప్ టైంలో పాక్ టీం పట్ల ఇండియా ఇలా వ్యవహరించడం దారుణమని ఐసీసీకి రాసిన లేఖలో పేర్కొంది. 29న హైదరాబాద్లో న్యూజిలాండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఇండియా పాక్ టీంకు వీసాలు మంజూరు చేసింది. దీంతో ఈ నెల 27న దుబాయ్ మీదుగా ఇండియా చేరుకోనుంది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభంకానున్నాయి.   


Tags:    

Similar News