ICC Worldcup2023: పాక్కు వీసా కష్టాలు.. 6 రోజుల్లోనే వరల్డ్కప్

By :  Bharath
Update: 2023-09-23 16:17 GMT

దయాది పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఆసియా కప్ లో గ్రూప్ 4 నుంచి వైదొలగడమే కాకుండా ఆ జట్టు కీ బౌలర్ నసీం షా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అయినా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు పట్టుదలతో బరిలోకి దిగి.. కప్పు గెలవాలనే ఆశలో ఉంది పాకిస్తాన్. వరల్డ్ కప్ లో పాక్ మ్యాచ్ లకు ఇంకా వారం రోజుల మాత్రమే ఉంది. ఈ గ్యాప్లో దుబాయ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్న పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది.

భారత పర్యటనకు పాక్ ప్లేయర్లకు ఇంకా వీసా అందలేదు. ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కాగా వీసా కోసం వారం రోజుల క్రితమే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పాక్ ముందస్తుగా తీసుకున్న దుబాయ్ ట్రిప్ రద్దుయి.. ఆటగాళ్లు, సిబ్బంది స్వదేశంలోనే ఉండిపోయారు. వీసా ఓకే అయితే దుబాయ్ మీదుగా పాక్ జట్టు సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగే వార్మమ్ మ్యాచ్ ఆడుతుంది.

Tags:    

Similar News