పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. న్యూజిలాండ్పై గెలుపు

By :  Krishna
Update: 2023-11-04 14:51 GMT

వరల్డ్ కప్లో పాకిస్తాన్ నాలుగో విక్టరీని అందుకుంది. న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 21 రన్స్ తేడాతో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 402 లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. 21 ఓవర్ల వద్ద వర్షం రావడంతో మ్యాచ్ ను కొద్దిసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 41ఓవర్లలో 341గా అంపైర్లు నిర్ణయించారు. 25ఓవర్ల వద్ద వర్షం మళ్లీ పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్‌ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. కానీ పాకిస్తాన్ అప్పటికే 200/1 పరుగులు చేయడంతో 21 రన్స్ తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

పాక్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్‌ 126, బాబర్ అజామ్ 66 రన్స్ తో రాణించారు. ఫకార్ సిక్సులు, ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 63 బంతుల్లోనే సెంచరీ చేసి.. ప్రపంచకప్‌లో పాక్‌ తరఫున వేగవంతమై సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 50ఓవర్లకు 401 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్ కాన్వే (35) త్వరగా ఔట్ అయినా.. మరో ఓపెనర్ రచిన్ (108), విలియమ్సన్ (95) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ, ఇఫ్తికర్, రవూఫ్ తలో వికెట్ తీశారు.


Tags:    

Similar News