Sehar Shinwari:భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్స్ అయింది.. నటి ఆరోపణలు
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్-2023 లో భారత్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొదమసింహాల్లా ఒక్కొక్క భారత ఆటగాడు.. కివీస్ జట్టుపై విరుచుకుపడ్డారు. అటు బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ టీమిండియా హీరోస్.. న్యూజిలాండ్‌కి సినిమా చూపించారు. రోహిత్ శర్మ (47), శుభ్‌మన్ గిల్ (80*), విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (102), కేఎల్ రాహుల్ (39) భారీ స్కోరు చేయగా.. 398 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన కేన్ విలియమ్సన్ టీమ్‌ను భారత బౌలర్ షమీ మట్టికరిపించాడు. 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను టోర్నీ నుంచి ఇంటికి పంపించాడు. ఈ సెమీ ఫైనల్ విజయంతో దేశమంతా పండుగ చేసుకుంటోంది. భారత ఆటగాళ్లను సూపర్ హీరోస్ అంటూ కొనియాడుతున్నారు. ఇదే ఊపుతో ఫైనల్ కు చేరి కప్ సాధించాలని కోరుకుంటున్నారు. ఈ సంతోష సమయంలో ఓ హీరోయిన్.. సోషల్ మీడియా వేదికగా పిచ్చి కూతలు కూసింది. నిన్న జరిగిన భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు చేసింది.
Indian team players are good actors. They know this match is fixed but still pretending as if they are really playing this match 😂
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
ఆమెవరో కాదు.. ఇదివరకు భారత్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే.. ఆ జట్టులోని ఒక క్రికెటర్‌తో తాను డేటింగ్‌కి వెళ్తానని చెప్పిన పాక్ హీరోయిన్ సెహర్ షిన్వారీ. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో.. టీమిండియా గెలవకూడదని గట్టిగా కోరుకుంటున్న పాక్ జనాల్లో ఈమె కూడా ఒకరు. న్యూజీలాండ్ చేతిలో భారత జట్టు ఓడిపోతే.. అబ్దుల్లా షా ఘాజీ దర్గాలోని పేదలకు మటన్ బిర్యానీ పంచిపెడతానని మాటిచ్చిన ఈ భామ కోరిక నెరవేరకపోవడంతో ఇక భారత్ పై, బీసీసీఐ టీమ్ పై తన అక్కసు వెళ్లగక్కింది.
I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్స్ అయిందని టీమిండియా ప్లేయర్స్ కు కూడా తెలుసు కానీ.. తాము నిజంగా ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు నటిస్తున్నారని ఆరోపించింది. భారత జట్టు ఆటగాళ్లు మంచి నటులంటూ సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాసింది. అంతటితో ఆగకుండా భారత జట్టు మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ తన కుళ్లు, ద్వేషాన్ని బయటపెట్టింది. ఈ భారత దేశం అన్నింటిలో మనకంటే(పాక్ కంటే) ఎందుకు ముందుందని కిందా మీదా అయింది. త్వరలోనే బీసీసీఐ సర్వనాశనం కావాలంటూ శాపనార్థాలు పెట్టింది.