Haris Rauf : పాకిస్తాన్ ఇంత పెద్ద శిక్ష వేసిందేంటి? హరీస్ రౌఫ్‌ కెరీర్ ఏమవుతుంది?

Byline :  Bharath
Update: 2024-02-16 02:50 GMT

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తమ ప్లేయర్లకు వరుస షాక్ లు ఇస్తుంది. మొన్న బాబర్ ఆజంను కెప్టెన్సీని తప్పించగా.. ఇవాళ పేసర్ హరీస్ రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. దీంతో పాటు ఎలాంటి టీ20 లీగ్ లను ఆడకుండా నిబంధన విధించింది. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ పర్యటనకు హరీస్ రౌఫ్ దూరంగా ఉన్నాడు. తనకు ఎలాంటి గాయాకు కాకున్నా.. ఉద్దేశ పూర్వకంగా పర్యటన నుంచి తప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆసీస్ సిరీస్ నుంచి హరీస్ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. ఈ సిరీస్ జట్టుకు కీలకం అని, కనీసం 10 నుంచి 15 ఓవర్లు వేసినా చాలని టీం మేనేజ్మెంట్ హరీస్ ను కోరింది. వాటిని పట్టించుకోని హరీస్ జట్టునుంచి తప్పుకున్నాడు. ఈ సిరీస్ ఆడకుండా.. బిగ్ బాష్ లీగ్ లో ఆడాడు. దీంతో పీసీబీ అతనిపై సీరియస్ అయింది.

పీసీబీ తాజాగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకోవడానికి హరీస్ ఎలాంటి గాయం గానీ ఇతర సరైన కారణం గానీ చూపలేదని.. అందుకే అతని సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక అతని గైర్హాజరీకి గల కారణాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఏడాది మొత్తానికి అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ.. 2024 జూన్‌ 30 వరకు ఎలాంటి ఫారెన్‌ లీగ్‌లో ఆడేందుకు అనుమతించబోమరి తెలిపింది.






Tags:    

Similar News