నీరజ్ చోప్రా ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. ప్రశంసించిన ప్రధాని

Update: 2023-07-02 06:25 GMT

ఒలింపిక్‌ చాంపియన్, భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరోసారి మెరిశాడు. లౌసానేలో జరుగుతున్న డైమండ్ లీగ్ టోర్నీలో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫౌల్‌ త్రో తో గేమ్ మొదలుపెట్టిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నం ఫౌల్‌ కాగా ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. నీరజ్ తర్వాత రెండో స్థానంలో జూలియన్‌ వెబెర్‌ 87.03 మీటర్లు , జాకుబ్‌ వాద్లెచ్‌ 86.13 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు.




 


లుసానె డైమండ్‌ లీగ్‌ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రధాని మోదీ అభినందించారు. ట్విటర్‌ వేదికగా నీరజ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘‘ డైమండ్‌ లీగ్‌లో మెరిసిన నీరజ్కు కంగ్రాట్స్. అతడు అసాధారణ ప్రతిభ కనబరిచి విజయం సాధించాడు. నీరజ్‌ ఎంతో ప్రతిభావంతుడు. అతడి అంకితభావంతోనే ఇది సాధ్యమైంది’’అని ప్రధాని అభినందించారు.

డైమండ్‌ లీగ్‌ సిరీస్‌లో భాగంగా మొత్తం ఏడు మీట్‌లలో జావెలిన్‌ త్రో ఈవెంట్‌ ఉంది. ఏడు మీట్‌ల తర్వాత టాప్‌ - 8లో నిలిచిన వారు సెప్టెంబర్‌ 16,17 తేదీల్లో అమెరికాలో జరిగే గ్రాండ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. లుసాన్‌ మీట్‌లో టైటిల్‌ నెగ్గిన నీరజ్‌ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న నీరజ్‌కు ఈ మీట్‌లో ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు. 




Tags:    

Similar News