World cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోడీ

Byline :  Kiran
Update: 2023-11-16 14:45 GMT

భారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ చివరి దశకు చేరింది. బుధవారం జరిగిన మొదటి సెమీస్లో భారత్ ఫైనల్కు చేరుకోగా.. ఈ రోజు ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచే టీం టీమిండియాతో తలపడనుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్ కు ఓ స్పెషల్ గెస్టు రానున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బార్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్కు మోడీ హాజరయ్యారు. అది కూడా ఇదే స్టేడియంలో కావటం విశేషం. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మొత్తాన్ని చూడనుండటంతో క్రికెట్ అభిమానులతో పాటు అందరి దృష్టి అటువైపు మళ్లింది. మ్యాచ్ ఆదివారం రోజున ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. మోడీతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ మ్యాచ్కు అటెండయ్యే ఛాన్సుంది.


Tags:    

Similar News