సచిన్ ఇంటిని తాకిన రెజ్లర్ల నిరసన సెగ.. ఫ్లెక్సీలు పట్టుకుని..

Update: 2023-06-01 16:25 GMT

భారత రెజ్లరు చేపట్టిన నిరసన నానాటికీ తీవ్రం అవుతోంది. తమపై లైంగిక వేదింపులకు పాల్పిడిన ఎంపీ బ్రిజ్ భూషన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు గత ఐదు నెలలుగా నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ ఉద్యమ సెగ టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ని తాకింది. క్రీడాకారులపై ఇంత జరుగుతున్నా.. సచిన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ముంబై కాంగ్రెస్ యూత్ ప్రశ్నించింది. అంతేకాకుండా బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్డులోని సచిన్ ఇంటి వద్ద బ్యానర్లు ప్రదర్శించారు.

‘సచిన్.. మీరు భారత రత్న పొందారు. మాజీ ఎంపీ. క్రికెట్ లో గాడ్. అలాంటిది రెజ్లింగ్ కోచ్ పై వస్తున్న లైంగిక వేధింపులపై ఎందుకు స్పందించట్లేదు. మీ మౌనానికిక గల కారణం ఏంటి? దేశ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా రైతు ఉద్యమంపై మాట్లాడిన విదేశీ మహిళా క్రీడాకారిణికి మీరు ఆన్సర్ ఇచ్చారు. ఆ దేశ భక్తి ఎక్కడికి పోయింది. సీబీఐ, ఇన్ కంటాక్స్ దాడులకు భయపడి మీ స్వరాన్ని వినిపించడంలేదు. ఇకనైనా మాట్లాడండి మీ మద్దతును అందించండి’ అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన చేశారు. కాగా ఇప్పికే దేశంలోకి ప్రముఖులు రెజ్లర్లకు మద్దతుగా నిలబడ్డారు.

Tags:    

Similar News