IPL 2024 Auction: వేలంలో పొరపాటు.. తప్పుడు ప్లేయర్ను కొన్న పంజాబ్

Byline :  Bharath
Update: 2023-12-20 11:35 GMT

ఐపీఎల్ 2024 మినీ వేలం ముగిసింది. కొందరు ప్లేయర్లపై కాసుల వర్షం కురవగా.. మరికొందరికి అనుకున్నంత ధర పలకలేదు. ఇంకొందరు స్టార్ ప్లేయర్లు అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటు.. ఓ ప్లేయర్ కు వరంగా మారింది. వేలం చివరి దశకు చేరుకున్నప్పుడు.. అన్ క్యాప్డ్ ప్లేయర్ల బిడ్డింగ్ వేగంగా జరిగింది. ఈ క్రమంలో ఆక్షనీర్ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కు శశాంక్ సింగ్ అనే ఆటగాడిపై బిడ్ ప్రారంభించారు. దాంతో వెంటనే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రతీ జింతా బిడ్ వేస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చారు.

ఆ తర్వాత మిగతా మేనేజ్మెంట్ తో ప్రతీ జింతా మాట్లాడుతుండగా.. ఆక్షనీర్ వేలాన్ని ముగించేసింది. శశాంక్ సింగ్ కు రూ. 20 లక్షలకు పంజాబ్ దక్కించుకున్నట్లు తెలిపింది. ఈ టైంలో పంజాబ్ మేనేజ్మెంట్ తాము చేసిన పొరపాటును గ్రహించింది. శశాంక్ పై తమకు ఆసక్తి లేదని, బిడ్ ను క్యాన్సిల్ చేయాలని ఆక్షనీర్ ను కోరారు. దాన్ని అంగీకరించనీ ఆక్షనీర్.. శశాంక్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News