IND vs AUS: నేటి నుంచి ఆసీస్తో ప్రిపరేషన్ స్టార్ట్స్.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Byline :  Bharath
Update: 2023-11-23 02:32 GMT

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి అభిమానులను ఇంకా బాధిస్తూనే ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ల్లో వరుసగా ఫైనల్ చేరి.. అదే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 13 ఏళ్ల కల చెదిరిపోయినందుకు తట్టుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ ముద్దాడేందుకు మరో 4 ఏళ్ల వేచి చూడాలా అని ఆవేదన చెందుతున్నారు. అయితే టీమిండియా మాత్రం దానికి గట్టి బదులు ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఓడిపోయామనే బాధను పంటికింద బిగబట్టి.. తరువాత పోరుకు సిద్ధం అవుతుంది.

వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న పొట్టి ప్రపంచ కప్ కు రెడీ అవుతుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా.. ఇవాళ విశాఖపట్నం వేదికగా భారత్ Vs ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచుతో పాటు సిరీస్ కైవసం చేసుకుని, కంగారూ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పూర్తి కుర్రాళ్లతో కూడిన ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారద్య బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాకు గాయమై జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

తుది జట్లు అంచనా:

టీమిండియా: ఇషాన్ కిషన్, యశస్వీ జైశ్వాల్, సూర్య కుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ/ అవేష్ ఖాన్, ముకేశ్ యాదవ్.

ఆస్ట్రేలియా : షార్ట్, స్మిత్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, వేడ్ (C), ఇంగ్లిస్, అబాట్, ఎల్లిస్, బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా, హార్డీ.




Tags:    

Similar News