Asian Games 2023: వరుస సెట్స్లో సింధు ఓటమి..

Byline :  Bharath
Update: 2023-09-29 03:27 GMT

చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ కు షాక్ తగిలింది. పసిడి ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్ లో మన స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఓడిపోయింది. భారీ అంచనాల మధ్య టోర్నీలో అడుగుపెట్టిన సింధు.. క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్లోనే ఓటమి పాలయింది. థాయిలాండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పోర్న్ పావీ చొచువాంగ్ (ప్రపంచ 12వ ర్యాంక్) చేతిలో సింధు ఓటమిపాలయింది. మొదటి సెట్ లో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. ఆ తర్వాత దాన్ని నిలుపుకోలేకపోయింది. తర్వాత పుంజుకున్న థాయ్ ప్లేయర్ చొచువాంగ్.. వరుస సెట్స్ లో విజయం సాధించింది. సింధు 21-14, 15-21, 14-21 తేడాతో మ్యాచ్ కోల్పోయింది. 




Tags:    

Similar News