'రిలేషన్షిప్’పై ఓపెన్ అయిన పీవీ సింధు.. ఏమన్నారంటే?

Byline :  Bharath
Update: 2023-12-05 11:39 GMT

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన రిలేషన్షిప్ పై ఓపెన్ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సింధు.. తన వ్యక్తిగత జీవితంపై అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చింది. రిలేషన్షిప్ పై ఓపెన్ అయిన సింధు.. తాను సింగిల్ అని చెప్పుకొచ్చింది. ‘నేను ఎవరితో రిలేషన్ లో లేను. సింగిల్. ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్ తప్ప మరే ఇతర ఆలోచన లేదు. నా లక్ష్యం ఒలింపిక్స్ ఒక్కటే. దానికోసమే కష్టపడుతున్నా’ అని చెప్పుకొచ్చింది. బ్యాడ్మింటన్ కాకుండా మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా అని మరో ప్రశ్న అడగ్గా.. ‘దాని గురించి నేనేప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. అదంతా విధి అని భావిస్తా. ఏమని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేనేవరినీ డేటింగ్ చేయట్లేద’ని జవాబిచ్చింది.

ఒలింపిక్స్ లో ఇప్పటికే సింధు రెండు పతకాలు సాధించగా.. వచ్చే ఏడాది పారిస్ లో జరగబోయే ఒలింపిక్స్ కు సన్నద్ధం అవుతుంది. మూడో ఒలింపిక్స్ పతకంపై గురిపెట్టిన ఈ తెలుగు తేజం.. ఇప్పుడు బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది. ఇటీవల ఈ విషయాన్ని సింధు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మోకాలి గాయం కారణంగా ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్ నుంచి తప్పుకున్న సింధు.. ఆ తర్వాత సయ్యద్ మోదీ టోర్నీకి దూరమైంది.

Tags:    

Similar News