పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో స్వర్ణం సాధించడమే టార్గెట్‌గా భారత టాప్ షట్లర్ పీవీ సింధు కొత్త కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకునేందుకు రెడీ అయింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మాజీ ఛాంపియన్ మహమ్మద్ హఫీజ్ హషీమ్‌ను పర్సనల్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో భాగంగా హఫీజ్ దగ్గర శిక్షణ తీసుకునేందుకు పర్మీషన్ ఇవ్వాలని భారత క్రీడా ప్రాధికార సంస్థకు సింధు లేఖ రాసింది.
రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచింది. ఆ తరువాత టోక్యోలో కాంస్యం సాధించింది. గాయం కారణంగా దాదాపు అయిదు నెలలు విరామం తీసుకుంది సింధు..ఈ ఏడాది తనస్థాయికి తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. ఫిబ్రవరిలో కొరియా కోచ్ పార్క్ తే సంగ్ నుంచి సింధు దూరమైంది. 2024 ఒలింపిక్స్‌కు బ్యాడ్మింటన్ అర్హత వ్యవధి మే 1 నుంచి షురూ అయింది. ఈ క్రమంలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మాజీ ఛాంపియన్ మహమ్మద్ హఫీజ్ ఆధ్వర్యంలో సుచిత్ర అకాడమీలో గత రెండు వారాలుగా సింధు శిక్సణ తీసుకుంటోంది. 40 ఏళ్ల హఫీజ్ మలేసియా బ్యాడ్మింటన్ సంఘంలో జూనియర్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతే కాదు ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో అవధె వారియర్స్‌కూ శిక్షకుడిగా పని చేశాడు.