AUS vs NZ: నరాలు తెగే ఉత్కంఠ.. పోరాడి ఓడిన న్యూజిలాండ్

By :  Bharath
Update: 2023-10-28 13:28 GMT

రెండు ప్రపంచ మేటి జట్లు తలబడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఆసీస్ గెలవాలని పట్టుబడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఫీల్డింగ్ తో మ్యాచ్ గెలిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. నరాలు తెగే ఉత్కంఠలో మ్యాచ్ సాగితే ఎలా ఉంటుందో తెలుసా... ధర్మశాల ఫ్యాన్స్ కు మరోసారి డూ ఆర్ డై మ్యాచ్ చూసే అవకాశం లభించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో కివీస్ ఓడిపోయింది. ఆసీస్ నిర్దేశించిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. కివీస్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసిన కివీస్.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రచిన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54), నీషమ్ (58) రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో న్యూజిలాండ్ ఓటమి తప్పలేదు. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32)తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. టామ్ లాథమ్ (21), ఫిలిప్స్ (12) చేతులెత్తేశారు. నీషమ్ చివరి వరకు పోరాడినా రన్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

12 బంతుల్లో 32 పరుగులు కావాల్సినప్పుడు.. 49 ఓవర్లో హాజెల్ వుడ్ బౌలింగ్ లో 13 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన చివరి ఓవర్ లో 19 పరుగులు కావాల్సినప్పుడు మొదటి బంతి వైడ్ గా ఫోర్ పోయింది. దీంతో 5 పరుగులు వచ్చాయి. తర్వాత మూడు బంతుల్లో మొత్తం ఆరు పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ఫీల్డర్లు లబుషేన్, మ్యాక్స్ వెల్ అద్భుత ఫీల్డింగ్ చేశారు. డైవ్ లతో ఫోర్లు ఆపారు. దీంతో కివీస్ పరుగులు చేయడం కష్టం అయింది. 49.5 ఓవర్ బాల్ కు నీషమ్ రన్ ఔట్ కావడంతో ఆసీస్ గెలుపు ఖాయం అయింది. ఆసీస్ బౌలర్లలో జాంపా 3, కమ్మిన్స్, హాజెల్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీసుకున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో ఆసీస్ పాయింట్స్ టేబుల్ లో నాలుగా స్థానంలో కొనసాగుతుంది.

Tags:    

Similar News