PAK vs NZ: ‘రచిన్’, ‘కేన్’ ఊచకోత.. పాక్ బౌలర్ల బిత్తర చూపులు
Byline : Bharath
Update: 2023-11-04 08:17 GMT
కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ రెచ్చిపోయారు. పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసారు. ఓపెనర్ కాన్వే (35) తర్వరగా ఔట్ అయినా.. మరో ఓపెనర్ రచిన్ (108), విలియమ్సన్ (95) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌడరీలు బాదుతూ భారీ స్కోరుకు పునాదులు వేశారు. దాంతో 37 ఓవర్లలోనే కివీస్ 290 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే.. పాక్ బౌలర్లు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. కేన్, రచిన్ వెంటవెంటనే ఔట్ అయినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు మిచెల్ (17), చాంప్మన్ (11) కూడా దాటిగా ఆడుతున్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇఫ్తికర్, మహ్మద్ వసీం చెరో వికెట్ తీసుకున్నారు.