రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌..ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ స్కోర్ ఎంతంటే?

By :  Vinitha
Update: 2024-02-24 05:42 GMT

రాంచీ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఆల్ రౌండర్ జడేజా స్పిన్ తో గట్టి షాక్ ఇచ్చాడు.

7 వికెట్లు కోల్పోయి 302 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌..51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీతో మంచి ఫామ్ లో ఉన్న రాబిన్సన్‌(58)ను, ఆ తర్వాత షోయబ్‌ బషీర్‌ను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి స్పిన్ మాయాజాలం చూపించాడు. వెనువెంటనే వచ్చిన జేమ్స్‌ అండర్సన్‌ కూడా జడ్డూ బౌలింగ్ కి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. జడ్డూ బౌలింగ్‌లోనే ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. జోరూట్‌ శతకంతో(122) నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ తో అరగ్రేటం చేసిన ఆకాశ్ దీప్ నిన్న మూడు వికెట్లు తీసాడు. ఇండియా బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

Tags:    

Similar News