ఆ క్రికెటర్ విషయంలో.. బీసీసీఐ తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి

Update: 2023-06-24 17:15 GMT

భారత్ లో జరగునున్న వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ బుమ్రాను సిద్ధం చేయాలని చూస్తోంది. అందుకు ప్రాణాళికను సిద్ధం చేసి.. ఆగస్టులో ఐర్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేసింది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని మాజీ హెడ్ కోచ్ తప్పుబట్టాడు. బీసీసీఐ తొందరపడితే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందని హెచ్చరించాడు. గతేడాది సెప్టెంబర్ లో వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరంమైన బుమ్రా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ సిరీస్ లో బుమ్రాను బరిలోకి దింపితే.. ఆ గాయం ఇంకా ఎక్కువై మరో నాలుగు రోజులు ఆటకు దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

బుమ్రా విషయంలో గతంలో కూడా ఇలానే చేసింది బీసీసీఐ. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. జట్టులోకి దింపి ఆడించారు. దాంతో గాయం ఎక్కువై టోర్నీ మధ్యలోనుంచే వైదొలిగాడు. దాంతో టీమిండియా బుమ్రా లేకుండానే టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో బరిలోకి దిగి దారుణంగా విఫలం అయింది. ప్రస్తుతం మెగా టోర్నీలన్నీ ముందు ఉన్నాయి. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లో బుమ్రాను ఆడించాలని బీసీసీఐ భావిస్తే మరో నాలుగైదు నెలలు బుమ్రా ఆటకు దూరం అవుతాడని రవిశాస్త్రి అన్నాడు.


Tags:    

Similar News