Ravichandran Ashwin : మూడో టెస్టు నుంచి.. అర్ధాంతరంగా తప్పుకున్న అశ్విన్

Byline :  Bharath
Update: 2024-02-17 01:49 GMT

మూడో టెస్టు రసవత్తరంగా సాగుతుంది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. బౌలింగ్ లో తేలిపోయింది. ఇంగ్లాండ్ రెండు వికెట్లు తీసినా.. భారీగా రన్స్ ఇచ్చుకుంది. దీంతో ఇంగ్లాండ్ 207 పరుగులతో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. బెన్ డకెట్ 133 నాటౌట్ క్రీజులో కుదురుకున్నాడు. కాగా నిన్న ఒక వికెట్ పడగొట్టిన అశ్విన్ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. కాగా ఈ టెస్టు సిరీస్ కు అశ్విన్ భాగం అవడం టీమిండియాకు కలిసొచ్చే విషయమే. అతని సీనియారిటీ జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో అశ్విన్ టీమిండియాకు షాకిచ్చాడు. మూడో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలిపింది.

స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అశ్విన్ కుటుంబంలో తలెత్తిన వైద్య పరమైన అత్యవసర పరిస్థితి కారణంగా.. ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ కు అండగా ఉంటామని ధైర్యం చెప్పింది బీసీసీఐ. కాగా నిన్నటి మ్యాచ్ తో టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన అశ్విన్.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లు పడగొట్టారు. కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లు తీయగా.. శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ 87 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. 13ఏళ్ల కేరీర్ లో 98 మ్యాచుల్లోనే ఈ ఘనతను సాధించాడు.




Tags:    

Similar News