IPL Auction 2024: డేంజరస్ పేసర్కు RCB గాలం.. పంజాబ్ కింగ్స్ పెద్ద ప్లాన్..

Byline :  Bharath
Update: 2023-12-19 16:02 GMT

ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆర్సీబీ జట్టు ఆచితూచి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ముఖ్యంగా బౌలర్లపై దృష్టిపెట్టింది. చివరివరకు నామమాత్రంగానే వేలంలో పాల్గొన్న ఆర్సీబీ.. డేంజరస్ పేసర్ కు గాలం వేసింది. న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గుసన్ ను రూ.2 కోట్ల తక్కువ ధరకే సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా హిట్టర్ రిలీ రోసోవ్ ను పంజాబ్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ రాబిన్ మింజ్ ను రూ.3.60 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. ముజీవ్ రహ్మాన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీని రూ.1.5 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది.

నాండ్రీ బర్గర్‌ను రూ. 50 లక్షలకు రాజస్థాన్‌, షై హోప్‌ను రూ. 75 లక్షలకు ఢిల్లీ, అట్కిన్‌సన్‌ను రూ. కోటికి కోల్‌కతా, ముజీవ్ రహ్మాన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా, మనీశ్ పాండేను రూ.50 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది. కాగా ప్రస్తుత వేలం ముగిసింది. వేలంలో 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వీరికోసం రూ.230.45 కోట్లను వెచ్చించాయి. ఓవర్సీస్‌కు సంబంధించి 30 స్లాట్‌లు పూర్తి కావడం విశేషం.

  • సుబ్రమణ్యన్‌ను హైదరాబాద్ రూ. 20 లక్షలకు
  • ప్రిన్స్‌ చౌధరిని పంజాబ్‌ కింగ్స్‌ రూ. 20 లక్షలకు
  • మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌ రూ. 20 లక్షలకు లక్నో
  • స్వస్తిక్‌ ఛికారాకు ఢిల్లీ రూ. 20 లక్షలు
  • అబిద్ ముస్తాక్‌కు రాజస్థాన్‌ రూ. 20 లక్షలు
  • శివలిక్‌ శర్మకు ముంబై రూ. 20 లక్షలు
  • స్వప్పిల్‌ సింగ్‌కు బెంగళూరు రూ. 20 లక్షలు
  • అవనిష్‌ రావు అరవెల్లికి చెన్నై రూ. 20 లక్షలు
  • షకిబ్ హుస్సేన్‌కు కోల్‌కతా రూ. 20 లక్షలు
  • నాండ్రీ బర్గర్‌కు రూ. 50 లక్షలు రాజస్థాన్

Tags:    

Similar News