ఆర్సీబీ యాజమాన్యం జలక్.. వాళ్లను మార్చుతూ.. కీలక నిర్ణయం

Update: 2023-07-17 15:21 GMT

ఐపీఎల్ ట్రోఫీకి- ఆర్సీబీ జట్టుకు.. ఆకాశానికి- భూమికి ఉన్నంత దూరం ఉంది. ప్రతీ సీజన్ లో ట్రోఫీపై ఆశలతో బరిలోకి దిగడం.. చివరికి బొక్కబోర్లా పడటం కామన్ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ‘ఈ సాలా కప్ నమ్ దే’ అంటూ హడావిడి చేయడం.. నిరాశగా మరో ఏడాది ఎదురుచూడటం తప్ప చేసేదేంలేదు. ఇన్ని సీజన్ల నుంచి ఆటగాళ్లను మార్చినా, కోచ్ లను మార్చినా, కెప్టెన్లను మార్చినా.. సెంటిమెంట్ తో జెర్సీని మార్చినా ఆర్సీబీ రాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం.. ఆర్సీబీ యాజమాన్యం మరో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆర్సీబీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ లను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.హెస్సన్, బాంగర్ లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతోనే ఉన్నారు. బాంగర్ ను 2022లో ఆర్సీబీ హెడ్ కోచ్ గా నియమించింది. ఈ నిర్ణయంతోనైనా ఆర్సీబీ రాత మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు

Tags:    

Similar News