Reasons For India Defeat : గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్.. చివరికి బోల్తా.. భారత్ ఓటమికి కారణాలివే
గతకొన్నేళ్లుగా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ అనగానే భారత్ రెచ్చిపోతుంది. ఎంత పెద్ద జట్టుపై అయినా సునాయాసంగా గెలుస్తుంది. స్పిన్ ను బలంగా చేసుకుని కొన్నేళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇక స్వదేశంలో ఇంగ్లాండ్ పై భారత్ దే ఆదిపత్యం. పైగా ఉప్పల్ వేదికపై ఓడిపోయిన చరిత్ర లేదు. అశ్విన్, జడేజా, బుమ్రా.. లాంటి బౌలర్లు జట్టు సొంత. అంతేకాకుండా మొదటి మూడు రోజుల్లో ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. తర్వాత చేతులెత్తేసింది. చివరిరోజు ఇంగ్లాండ్ స్పిన్ కు బోల్తాపడింది. బౌలర్లు వికెట్లు తీయకపోగా.. టార్గెన్ ను చేదించలేక చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. కాగా భారత్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. కాగా ఈ ఓటమితో స్వదేశంలో జరిగిన చివరి మూడు టెస్ట్ మ్యాచుల్లో టీమిండియా ఓడిపోయింది.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ తేలిపోవడానికి ప్రధాన కారణం ఓలీ పోప్. తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసిన పోప్.. రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయాడు. 196 పరుగులతో రాణించిన పోప్.. రెండు సార్లు క్యాచులు ఇచ్చినా మనోళ్లు జారవిడిచారు. అది భారత్ కు పెద్ద మైనస్ అయింది. అక్కడినుంచి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లిన పోప్ ఇంగ్లాండ్ కు 231 పరుగుల ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు.
మొదటి ఇన్నింగ్స్ లో పరవాలేదనిపించిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యారు. అశ్విన్, జడేజా, అక్షర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సిరాజ్ సొంతగడ్డపై తేలిపోయాడు. మేటి స్పిన్ బౌలర్ల స్వదేశంలో తేలిపోవడం, బుమ్రా చెలరేగినా.. మిగతా బౌలర్ల నుంచి సహకారం అందకపోవడం జట్టుకు మైనస్ అయింది. అంతేకాకుండా ఫీల్డింగ్ లో కూడా టీమిండియా పేసర్లు నిరాశపరిచారు. క్యాచులు, బౌడరీలు ఆపడంలో ఫెయిల్ అయ్యారు.
మొదటి ఇన్నింగ్స్ లో చెలరేగిన భారత్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేశారు. యువ ప్లేయర్లు జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ ఘోర ప్రదర్శన ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. లక్ష్యం చిన్నదే అయినా.. ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకున్నారు. చివరికి ఒత్తడికి లోనై వికెట్లు సమర్పంచుకున్నారు. సీనియర్ బ్యటర్లు కూడా చెత్త బ్యాటింగ్ తో వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది.