Ind vs SA: సూర్య భాయ్ చెప్తేనే చేశా.. సారీ చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైరల్‌

By :  Bharath
Update: 2023-12-13 15:06 GMT

ఐపీఎల్ 2023లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ తో అదరగొట్టిన రింకూ సింగ్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేస్తున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ.. తన ఫినిషర్ రోల్ కు న్యాయం చేస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రింకూ.. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై కూడా సత్తా చాటుతున్నాడు. రెండో టీ20లో చెలరేగిన రింకూ తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఓపెనర్లు ఫెయిలైన వేళ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (56)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో రింకూ కొట్టిన సిక్స్ కు మీడియా గ్లాస్ బాక్స్ బద్దైంది.

19వ ఓవర్ లో మార్క్రమ్ బౌలింగ్ లో రింకూ స్ట్రైట్ సిక్స్ కొట్టగా.. ఆ దెబ్బకు గ్లాస్ బద్దలైంది. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన రింకూ.. స్టేడియం నిర్వాహకులకు సారీ చెప్పాడు. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘మ్యాచ్ సమయంలో సూర్య భాయ్ వచ్చి ఒత్తిడిని ఎదుర్కొని.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడమన్నాడు. దాంతో నేను రెచ్చిపోయా. అయితే అద్దాలు పగలగొట్టాలన్నది నా ఉద్దేశం కాద’ని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో నెటిజన్స్ రింకూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News