మా అమ్మ కల నెరవేరింది-రింకూ సింగ్ భావోద్వేగం

Update: 2023-08-18 08:45 GMT

ఐర్లాండ్ తో మూడు టీ20 సీరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.ప్రస్తుత టీమ్ ఇండియాకు అతనే కెప్టెన్ కూడా. అలాగే రింకూ సింగ్, జితేశ్ శర్మలు తమ ఇంటర్నేషనల్ అరంగేట్రం కూడా చేస్తున్నారు.

టీ20 సీరీస్ కోసం సీనియర్లందరికీ రెస్ట్ ఇచ్చారు భారత సెలెక్టర్లు. ఐపీఎల్ లో ఆడిన యువఆటగాళ్ళ జట్టును ఐర్లాండ్ పంపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జట్టు మొత్తం ఐర్లాండ్ వెళ్ళింది. ఇందులో రింకై సింగ్, జితేశ శర్మలు మొదటిసారిగా ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించారు. జీవితంలో మొదటిసారి ఇలా ప్రయాణిస్తున్న వీరు తమ అనుభవాలను పంచుకున్నారు. రింకూ సింగ్ అయితే ఎంతో ఎమోషనల్ కూడా అయిపోయాడు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.

మన దేవానికి ఆడాలన్న కల నా ఒక్కడిదే కాదు, మా అమ్మది కూడా అంటున్నాడు రింకూ సింగ్. ఈరోజు మా ఇద్దరి కలా నిజమైందని భావోద్వేగంతో చెబుతున్నాడు. ఇలా ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం ఎంతో బావుందని అంటున్నాడు. నేను నా రూమ్ కు వెళ్ళాను , అక్కడ నా పేరు, 35 నంబర్ ముద్రించిన జెర్సీని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాను అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు రింకూ సింగ్.

ఇక జితేష్ శర్మ అయితే ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు సంతోషంలో మాటలు రావడం లేదు అని అంటున్నాడు. భారత క్రికెట్ జట్టుతో విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవమని చెబుతున్నాడు. ఇది నాకు లభించిన గౌరవం. అంతేకాదు పెద్ద బాధ్యత కూడా. దాన్ని నిర్వర్తించడానికి 100 ఎఫెక్ట్ పెడతా అని చెబుతున్నాడు జితేశ్ శర్మ.





Tags:    

Similar News