IRE vs IND: ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టిన టీమిండియా.. రింకూ సింగ్ సూపర్ ఎంట్రీ

Update: 2023-08-20 16:26 GMT

డబ్లిన్ వేదికపై టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఇరు జట్లు జట్టులో ఏ మార్పు చేయకుండా బరిలోకి దిగాయి. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుందామని టీమిండియా.. సిరీస్ రేసులో ఉండాలని ఐర్లాండ్ గట్టి పోటీనిస్తోంది. మొదటి ఓవర్ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. స్లో బాల్స్ వేస్తూ కట్టడి చేసింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్ (38, 21 బంతుల్లో 3సిక్సర్లు, 2ఫోర్లు) బౌలర్లను బాధడంతో భారత్ స్కోర్ 185కు చేరుకోగలిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు పవర్ ప్లేలోనే ఎదురుదెబ్బ తగిలింది. దాటిగా ఆడిన ఓపెనర్ జైశ్వాల్ (18, 11 బంతుల్లో) త్వరగా ఔట్ అయ్యాడు. మూడో వికెట్లో వచ్చిన తిలక్ వర్మ (1, 2 బంతుల్లో) ఈ మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు. తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (40, 26 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనర్ గైక్వాడ్ (58, 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టింది. తర్వాత వచ్చిన శివమ్ డూబె (22, 16 బంతుల్లో) మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడటంతో స్కోర్ బోర్డ్ కాస్త నెమ్మదించింది. చివరి ఓవర్లో స్ట్రైక్ తీసుకున్న డూబె ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. వరుసగా రెండు సిక్స్ లు బాది జోష్ పెంచాడు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెకర్తీ 2 వికెట్లు, మార్క్, యంగ్, వైట్ తలా ఓ వికెట్ పడగొట్టారు.


Similar News