PAK vs SL: ఫైనల్ కోసం బిగ్ ఫైట్.. శ్రీలంకకు భారీ టార్గెట్

Byline :  Bharath
Update: 2023-09-14 16:38 GMT

కొలంబో వేదికపై పాకిస్తాన్, శ్రీలంక జట్టు హోరాహోరీగా పోరాడుతున్నాయి. భారత్ తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు శ్రమిస్తున్నాయి. సూపర్ 4లో కీలక మ్యాచ్ ఆడుతున్న పాక్, శ్రీలంకకు మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడింది. దాంతో మ్యాచ్ రెఫరీ.. 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (4), బాబర్ ఆజమ్ (29), హారిస్ (3), నవాజ్ (12), షాదబ్ ఖాన్ (3) దారుణంగా విఫలం అయ్యారు. మరో ఓపెనర్ షఫిక్ (52)తో కలిసి రిజ్వాన్ (86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పడిపోతున్న పాక్ కు మంచి స్కోర్ ను అందించాడు. మరో బ్యాటర్ ఇఫ్తికర్ చివర్లో 47 పరుగులు జోడించగా 7 వికెట్ల నష్టానికి పాక్ 252 పరుగులు చేసింది. పతిరాణా 3, ప్రమోద్ 2 వికెట్లు తీసుకోగా.. తీక్షణ 1, దునిత్ ఒక వికెట్ పడగొట్టారు.




Tags:    

Similar News