Rohan Bopanna : 43 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న

Update: 2024-01-27 14:03 GMT

భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని ప్రశంసలు అందుకున్నాడు.

నేడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీతో ఇటలీకి చెందిన సిమోన్ బొలెల్లి - ఆండ్రియా వావోసోరి జోడిపై ఘన విజయం సాధించింది. రెండు సెట్లలో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరికి బోపన్న-ఎబ్డెన్ జోడీ ఈ మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది.

రోహన్ బోపన్న తన కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. అంతేకాకుండా గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయసు ఆటగాడిగా కూడా బోపన్న అరుదైన రికార్డును నెలకొల్పాడు. బోపన్న జోడీ విజయం సాధించడంతో వారికి ట్రోఫీతో పాటుగా రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.


Tags:    

Similar News