హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ
క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (63), జైశ్వాల్ (52) అర్థసెంచరీలతో అదరగొడుతున్నారు. రెండోసారి అజేయంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంచ్ బ్రేక్ భారత్ 121/0 పరుగులు చేసింది. మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్-జైశ్వాల్ జోడి తర్వాత జోరు పెంచింది. వీలుచిక్కినప్పుడు భారీ షాట్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. లంచ్ తర్వాత ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం. అయితే ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 45 పరుగుల వద్ద రోహిత్ ఈ రికార్డును క్రియేట్ చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో టీమిండియా తరుపున 2000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడు రోహిత్. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచులు ఆడిన రోహిత్ 2017 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 1942 పరుగులు చేశాడు.