వరల్డ్ కప్ ముందు రోహిత్ సేనను వెంటాడుతున్న అతి పెద్ద సమస్య..

Update: 2023-08-10 15:15 GMT

2011 తర్వాత వన్డే వరల్డ్ కప్ ముద్దాడని టీమిండియా ఈ సారి సొంతగడ్డపై సత్తాచాటాలని భావిస్తోంది. 2 నెలల్లో మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. కానీ జట్టు కూర్పుపై ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లు గాయలపాలవ్వడంతో మరిన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. దీనికి తోడూ ఎవ‌రిని ఏ స్థానంలో ఆడించాలి? అనేది తలనొప్పిగా మారింది. ప్రధానంగా నెం.4 సమ్య భారత్ మరోసారి వేధిస్తోంది.

నెం.4 అంటే టక్కున గుర్తుచ్చే పేరు యువరాజ్ సింగ్. టాప్ ఆర్డర్‌లో భారత్‎కు ఆడిన ఆటగాళ్లలో యువరాజ్ సింగ్‌ తిరుగులేని ప్లేయర్. భారత్ వన్డే, టీ20 వరల్డ్ కప్స్ సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. అయితే యువరాజ్ రిటైర్మెంట్ తర్వాత నెం.4 స్థానం సమస్య భారత్‌ను ఇబ్బంది పెడుతోంది. గత వరల్డ్ కప్ ముందుకు కూడా ఇదే ప్రాబ్లెమ్‌తో ఓటమి చవి చూసింది. యువరాజ్ తర్వాత ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేశాడు. అంతా కుదురుకున్నట్లే కనిపించినా అతడు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్‌కప్ నాటికి అతడు జట్టులోకి వస్తాడో కూడా క్లారిటీ రాలేదు.

ఈ సమస్యపైనే రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం చాలా కాలంగా ఇబ్బంది పెడుతోందని తెలిపాడు. యువీ తర్వాత ఆ స్థానంలో ఎవరూ స్థిరంగా లేరని వివరించాడు. చాలా గ్యాప్ తర్వాత ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ చేసినా..గాయాలబారినపడి ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. గత 4-5 సంవత్సరాలలో చాలా మంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారని దీంతో ఆ స్థానంలో కొత్త ఆటగాడినే ఆడించాల్సి వచ్చిందని రోహిత్ శర్మ స్ఫష్టం చేశాడు.



Tags:    

Similar News