బర్త్ డే వేళ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. ‘నీకేంటి గిఫ్ట్ ఇచ్చేది.. నువ్వే..!’

Update: 2023-07-19 12:17 GMT

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా నెట్స్ లో శ్రమిస్తోంది. గురువారం (జులై 20) మొదలబోయే రెండో టెస్ట్ మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలని విండీస్.. ఆధిక్యం దక్కించుకోవాలని టీమిండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా యంగ్ స్టర్ ఇషాన్ కిషన్ జులై 18న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అందరిలాగే ఇషాన్ బర్త్ డేను కూడా డ్రెస్సింగ్ రూమ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. విండీస్ ప్లేయర్లతో పాటు.. దిగ్గజాలు కూడా ఇషాన్ ను విష్ చేశాడు. ఈ సందర్భంగా రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్పటిలాగే రోహిత్ శర్మ ఇషాన్ ను ఆటపట్టించాడు. ఇషాన్ కు ఏ బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నారని ఓ జర్నలిస్ట్ అడగగా.. ‘ఏ గిఫ్ట్ కావాలి నీకు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. మేమేం ఇవ్వలేం. నువ్వే నెక్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మాకు గిఫ్ట్ అందించాల’ని రోహిత్.. ఇషాన్ ను కోరాడు. తొలి టెస్ట్ లో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ పరుగులేమి చేయలేకపోయాడు. 20 బంతులాడి ఒక్క పరుగే తీసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేశాడో. దాంతో ఇషాన్ కు బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం రాలేదు.

Tags:    

Similar News